Allu Arjun : పుష్ప 2 షూటింగ్ పై ఫైనల్ అప్డేట్

Allu Arjun :  పుష్ప 2 షూటింగ్ పై ఫైనల్ అప్డేట్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్.. ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. సుకుమార్ ను దర్శకుడుగా నెక్ట్స్ లీగ్ లో నిలిపింది. ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15నే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేశారు. మరింత బెస్ట్ అవుట్ పుట్ కోసమే ఇలా చేశారు. కాదూ.. సుకుమార్ కు, అల్లు అర్జున్ కు చెడింది అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఈ లోగా పొలిటికల్ ఇష్యూస్ లో తలదూర్చాడు అల్లు అర్జున్. ఆ హీట్ ఉండగా సినిమా వస్తే డామేజ్ తప్పదనే పోస్ట్ పోన్ చేశారు అన్నవాళ్లూ ఉన్నారు. ఎవరు ఎలా అనుకున్నా.. ఫైనల్ గా సినిమా రేంజ్ ను డిసైడ్ చేసేది కంటెంట్. ఆ కంటెంట్ ఉంటే ఈ కామెంట్స్ ఏం పనిచేయవు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలూ దుమ్మురేపుతున్నాయి. మరో 50 రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ టైమ్ లో సినిమా టీమ్ నుంచి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. పుష్ప 2 చిత్రీకరణ పూర్తయిందట. ఈ విషయాన్ని సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ తన దర్శకుడు సుకుమార్ తో పాటు ఫహాద్ ఫాజిల్ తో కూడిన ఫోటో పోస్ట్ చేస్తూ షేర్ చేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తిగా లాక్ చేశాం అనే న్యూస్ కూడా చెప్పారు. అది అద్భుతం అంటున్నారు కొందరు. ఇదీ అలాగే ఉంటే పుష్ప 2 రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం.

Tags

Next Story