Allu Arjun : ఫైనల్ గా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు

ఈ మధ్య సెలబ్రిటీ రివ్యూస్ ట్రెండ్ బాగా పెరిగింది. రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీపై టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అంతా ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. ఆ సినిమా గురించి ఆహా ఓహో అని పొగిడేశారు. అది పూర్తిగా యూత్ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చిన మూవీ. బట్ ఆ తర్వాత వారం వచ్చిన మిరాయ్ విషయంలో ఈ ప్రసంశలు కనిపించలేదు. అసలు ఏ టాప్ స్టార్ కూడా ఈ చిత్రం గురించి మాట్లాడలేదు. అంటే తేజ సజ్జా అనే వాడు తమకంటే బెటర్ గా దూసుకుపోతున్నాడు అనే జెలసీనా లేక నిజంగానే ఎవరికీ తీరిక లేక పట్టించుకోలేదా అనేది చెప్పలేం కానీ.. ఈ విషయంలో టాలీవుడ్ లో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ బ్రిలియన్సీ, మంచి కథ, కథనాలతో రూపొందిన మిరాయ్ పై సెలబ్రిటీ రివ్యూస్ రాకపోవడం ఆశ్చర్యమే కదా. అయితే ఫైనల్ గా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీపై రియాక్ట్ అయ్యాడు.
ఈ సినిమాను, టెక్నీషియన్స్, హీరో, మంచు మనోజ్, ఆర్టిస్ట్స్, డైరెక్టర్ ను పొగడ్తల్లో ముంచెత్తుతూ.. తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. సి.జి, ఆర్ట్, మిక్సింగ్ గురించి ప్రస్తావించాడు. మ్యూజిక్ హాంటింగా ఉందని గౌరహరిని ప్రశంసించాడు. న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్ మార్క్ ను వదులుతూ కమాండబుల్ వర్క్ చేశారు అంటూ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురించి చెప్పాడు. అతని ట్వీట్ చూస్తే ఏదో మొక్కుబడిగా చెప్పినట్టు కాకుండా మనస్ఫూర్తిగానే ప్రశంసించాడు అనిపించేలా ఉంది.
మొత్తంగా అల్లు అర్జున్ స్పందించాడు కాబట్టి.. మిగతా స్టార్స్ కూడా రియాక్ట్ అవుతారేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com