Allu Arjun : అల్లు అర్జున్ కోరిక నెరవేరింది

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప 2 ఇచ్చిన మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఈ మూవీతో హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అదే సమయంలో అనుకోకుండా జరిగిన పొరబాటుకు జైలు( ఒక్కరాత్రే అయినా సరే) జీవితమూ గడపాల్సి వచ్చింది. ఇటు కేస్ లంటూ కోర్ట్ లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాడు అనే చెప్పాలి. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న బాలుడు శ్రీ తేజను పరామర్శించాలని అతను చాలాకాలంగా అనుకుంటున్నాడు. కానీ అందుకు మొదట కోర్ట్, తర్వాత పోలీస్ లు పర్మిషన్ ఇవ్వలేదు. తన కొడుకు వయసున్న బాలుడు అంటూ ఆ మధ్య భావోద్వేగానికి గురయ్యాడు బన్నీ.
అయితే పోలీస్ లు మరీ సాగదీస్తే బాగోదు అనుకున్నారేమో.. హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు అనుమతి ఇచ్చారు. కాకపోతే ముందుగా సమాచారం చెబితే తగిన బందోబస్త్ చేస్తాం అన్నారు. దీంతో ఆయన సమాచారం ఇచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించాడు. ఇప్పటికే బాలుడి హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తాం అని అల్లు అర్జున్ టీమ్ హామీ ఇచ్చింది. ఆ మేరకు ఆయన కూడా నిలబడుతున్నాడు. మొత్తంగా చాలా రోజులుగా హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించాలనుకున్న అల్లు అర్జున్ కోరిక నెరవేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com