Ravi Teja : ఫైనల్ గా భర్త మహాశయులకు ఓటిటిలోకి

మాస్ మహరాజ్ రవితేజ్ హీరోగా నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తికి మంచి టాక్ వచ్చింది. రవితేజ తన ఇమేజ్ ను దాటి కనిపించడం.. అతని యాటిట్యూడ్ బావుండటం.. దీంతో పాటు అషికా రంగనాథ్ గ్లామర్ చాలా ప్లస్ అవడంతో పాటు మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ కనిపించడంతో హిట్ టాక్ వచ్చేసింది. అయితే ఈ మూవీతో పాటు విడుదలైన అన్ని సంక్రాంతి మూవీస్ ఆల్రెడీ ఓటిటిలో విడుదలయ్యాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఫిబ్రవరి 13న ఓటిటిలోకి వస్తుంది అనే టాక్ వినిపించింది. బట్ ఆ టైమ్ కు ఈ మూవీ ఓటిటిలోకి రాలేదు. అందుకు కారణమేంటీ అంటే.. మూవీ రిలీజ్ తర్వాత రెండు నెలలకు ఓటిటిలోకి రావాలి అన్న రూల్ వల్లేట. ఆ రూల్ వల్లే ఇన్ని రోజులు ఈ మూవీ ఓటిటిలోకి రాలేదు అంటున్నారు.
ఆ రూల్ వల్లే ఆలస్యం అనే మాటలో నిజం లేదు అనేందుకు చాలా ఉదాహరణలున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది. ఈ నెల 13నుంచి జీ5లో స్ట్రీమ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ, మళయాలంలో కూడా ఈ మూవీ ఉండబోతోంది. అంటే ఈ మూవీ స్పాన్ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. మరి ఈ మూవీకి ఓటిటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
