Pooja Hegd : పూజా హెగ్డే.. ఎన్నాళ్లకెన్నాళ్లు

కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాలు లేక ఇబ్బంది పడుతుంది పూజా హెగ్డే. 2022లో చేసిన రాధేశ్యామ్, తర్వాత ఆచార్యతో పాటు ఎఫ్ 3లో చేసిన ఐటమ్ సాంగ్ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. అంతకు ముందు అల వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నా.. ఎందుకో ఆ రేంజ్ ను కంటిన్యూ చేయలేకపోయింది. ఈలోగా తమిళ్ తో పాటు హిందీలో మూవీస్ లోనూ కనిపించింది. బట్ తన మెయిన్ టార్గెట్ గా తెలుగులో ఉంది. కానీ తెలుగులో ఆ స్థాయిలో సినిమాలు పడటం లేదు. రీసెంట్ గా కొన్ని రూమర్స్ వచ్చాయి. అవన్నీ అలాగే మిగిలిపోయాయి. అయితేనేం ఎట్టకేలకు మరో తెలుగు మూవీ ఆఫర్ పట్టేసింది. ఇది రూమర్ గా మాత్రం ఆగిపోవడం లేదు.
శర్వానంద్ సరసన పూజా హెగ్డే నటించబోతోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్ల. ప్రస్తుతం అస్సలు ఫామ్ లో లేని శ్రీనుకు వైట్ల శర్వానంద్ ఆఫర్ ఇవ్వడం అంటే సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. అంటే ఈ మూవీకి ఏదో ప్రత్యేకత ఉన్నట్టే కదా. ఈ మూవీ టైటిల్ ‘జార్జ్ క్రిష్’అని పెట్టారు. అంటే హిందూ, క్రిస్టియన్ నేపథ్యంలో సాగే కథలా ఉండేలా ఉంది. మొత్తంగా పూజా హెగ్డేకు ఇది ఓ మంచి ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈ మూవీతో మళ్లీ ప్రూవ్ చేసుకుంటే తర్వాత మరికొన్ని ఆఫర్స్ పడతాయి. త్వరలోనే ఈ మూవీ ఓపెనింగ్ జరగబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
