Mahesh Babu : రాజమౌళి - మహేష్ బాబు .. చివరికి తనే ఫైనలా

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే రాజమౌళిని తిడుతున్నారు కూడా. బట్ ఓ ఎపిక్ మూవీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే కాస్త పేషన్సీ కూడా ఉండాలి. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ మూవీ. ఆల్రెడీ చిత్రీకరణ చేస్తున్నారు కూడా. అయితే ఈ మూవీలో హీరోగా మహేష్ బాబు అని తప్ప మరో అప్డేట్ కనిపించడం లేదు. అఫ్ కోర్స్ టెక్నికల్ గా రాజమౌళి ఆస్థాన టీమ్ అంత ఉంటుంది. వీళ్లు కాకుండా ఆర్టిస్టుల పరంగా.. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎవరా అనేది ఎవరికీ తెలియడం లేదు. కొన్నాళ్లుగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు వినిపించింది. అంతకు ముందు చాలా పేర్లే వినిపించాయి. దీంతో ప్రియాంక పేరూ అలానే వచ్చిందేమో అనుకున్నారు. బట్ చివరికి తనే ఫైనల్ అనేది తేలిపోయిందని టాక్.
ఫైనల్ గా ప్రియాంక చోప్రానే మహేష్ బాబు సరసన తీసుకున్నారు అంటున్నారు. తాజాగా తను హైదరాబాద్ రావడం రాజమౌళిని మీట్ అవడం కూడా అయిపోయింది. ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అటు ప్రియాంక కూడా వాల్డ్ ఆడియన్స్ కు బాగా పరిచయమైంది. బోల్డ్ సీన్స్ కు కూడా నో చెప్పదు. యాక్షన్ సీక్వెన్స్ లలోనూ ఆకట్టుకుంటోంది. ఇవన్నీ రాజమౌళి మార్క్ ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలే కాబట్టి.. తను పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాకపోతే ఇండియన్ ఆడియన్స్ ఎన్నాళ్లుగానో చూస్తోన్న ఫేస్ అనేదే కొందరికి నచ్చడం లేదు. బట్ క్యారెక్టర్ కు సెట్ అయితే చాలు అనేది మేకర్స్ ఫీలింగ్ కదా. సో.. తననే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చేశారు అంటున్నారు. అయితే తను సూపర్ స్టార్ కు జోడీగా నటిస్తుందా లేక ఇంకేదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తుందా అనేది కూడా అప్పుడే చెప్పలేం. ఏదేమైనా ప్రియాంక చోప్రానే ఫైనల్ అనేది మాగ్జిమం తెలుస్తోన్న విషయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com