Game Changer : హమ్మయ్య.. గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ చెప్పేశారు

Game Changer :  హమ్మయ్య.. గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ చెప్పేశారు
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా చాలా ఎదురు చూస్తున్నారు. బట్ వారి పేషెన్సీతో టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్నారు మేకర్స్. షూటింగ్ పరంగానూ చాలా కాలం పాటు సా.. గుతూ వచ్చింది. డిసెంబర్ లో విడుదల అనుకుంటే వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల అంటూ కొత్త పోస్టర్ వేశారు. సరే సంక్రాంతి ఇంకా బెస్ట్ సీజన్ కాబట్టి పెద్ద హిట్ అయిపోతుంది ఫ్యాన్స్ హ్యాపీస్ అయ్యారు.

దీపావళి రోజున టీజర్ విడుదల చేస్తున్నారు అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూసే చెప్పారు మేకర్స్. దీపావళికి టీజర్ రావడం లేదు అని చెప్పారు. కాకపోతే టీజర్ డేట్ మాత్రం చెప్పి కొంత వరకూ శాటిస్ ఫై చేశారు. హ్యాపీ దీపావళి అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పటి వరకూ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన బెస్ట్ కంటెంట్ అని చెప్పాలి. రామ్ చరణ్ బ్లాక్ గ్లాస్ పెట్టుకుని గళ్ల లుంగీ, నల్ల బనీనుతో నలుగురైదుగురు రౌడీలను రైలు పట్టాలపై పడుకోపెట్టి వారి ముందు కూర్చుని వారికి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ కు హై వస్తుందని చెప్పాలి. ఇలాంటివే వాళ్లు టీజర్ లోనూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈపోస్టర్ లోనే నవంబర్ 9న టీజర్ విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. సో ఫ్యాన్స్ ఇక ఏ కన్ఫ్యూజన్ లేకుండా నవంబర్ 9 కోసం వెయిట్ చేయొచ్చు. ఈ డేట్ ను అఫీషియల్ గా చెప్పారు కాబట్టి ఇక నో మోర్ రూమర్స్ అనుకోవచ్చు.


Tags

Next Story