చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ఒంగోలు సెంకడ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటుగా రూ. 95 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది కోర్టు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఇచ్చిన రూ. కోటి రూపాయలకు ఇచ్చి చెక్ బౌన్స్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించింది.

టాలీవుడ్‌కు ఫైనాన్స్ చేసే వారిలో ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. మినీ ముంబైగా ప్రొద్దుటూరు ప్రసిద్ది చెందింది. అక్కడి వడ్డీ వ్యాపారం అంతా గోప్యంగా సాగిపోతూ ఉంటుంది. సాధారణంగా సినిమా నిర్మాతలకు ఇచ్చే అప్పులకు ఓ లెక్క ఉంటుంది. అన్నీ క్లియర్ చేస్తేనే ల్యాబ్‌లో సర్టిఫికెట్ ఇస్తారు. కానీ బండ్ల గణేష్ ప్రొద్దుటూరు వడ్డీ వ్యాపారుల నుంచి సినిమా పేరుతో .. సినిమాకు సంబంధం లేకుండా అప్పు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. సినిమా రిలీజైనా వాటిని చెల్లించకపోవడంతో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story