Jr NTR : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తారక్ కటౌట్‌కు నిప్పు

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే.. సినిమా విడుదల సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అపశృతి చోటు చేసుకుంది.
థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు అంటుకుంది. ఎన్టీఆర్ కటౌట్ తగలబడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. సినిమా నచ్చని కొంతమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ కటౌట్ ను తగలబెట్టారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే.. కటౌట్ ను ఫ్యాన్స్ తగలబెట్టలేదని, టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కటౌట్ కు నిప్పు అంటుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com