First Day First Show : ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ రిలీజ్.. కథ మొత్తం దాని చుట్టే..

First Day First Show : జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ అందించిన కథతో తెరకెక్కిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను నటుడు నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తుంది. కథ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చుట్టే తిరుగుతుంటుంది. ఖుషి మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటాడు హీరో ఇంకా అతని ఫ్రెండ్స్. అయితే అలా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోవడం వల్ల పంచభూతాల్లో ఎలాంటి మార్పు రాదని చెప్పి నిరూపించే నాన్న పాత్రలో తనికెళ్ల భరణి నటిస్తారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుత్తం షెట్టి దీనికి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, మహేశ్ ఆచంట ప్రధాన పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com