'డీజే టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో రిలీజ్

డీజే టిల్లు స్క్వేర్ నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో రిలీజ్
X
'డీజే టిల్లు స్క్వేర్'తో మరోసారి రచ్చ చేయనున్న సిద్దు జొన్నలగడ్డ

టాలెంటెడ్‌ యాక్టర్‌ సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన తెలంగాణ యాసతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ 'టిల్లు 2'తో అభిమానుల్ని మరోసారి ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యాడు. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా మూవీ నుంచి తాజాగా టికెటే కొనకుండా అనే సాంగ్‌ ప్రోమో విడుదలైంది. సిద్ధు మూవీ కోసం ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు ఇది మంచి బూస్టప్ లా మారింది.

సిద్దు షూస్‌ క్లీన్ చేస్తూ.. మనసు విరిగినట్టున్నది ఎక్కడ్నో.. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్‌.. అంటూ అనుపమతో సిద్దు చిట్‌ చాట్‌ చేస్తున్న వీడియోతో మేకర్స్ ఈ సాంగ్‌ ప్రోమో అప్‌డేట్ ను అందించారు. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నట్టు కూడా వెల్లడించారు. ఈ ప్రోమోను బట్టి చూస్తుంటే.. ఈ సారి డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ తోనే సిద్ధు రానున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ట్యాక్సీలో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

మొత్తానికి ఈ సారి 'టిల్లు 2'లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాన్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతోనే అర్థమవుతోంది. ఈ సారి కూడా సిద్ధు ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఫిబ్రవరి 12న 2022న డీజే టిల్లుతో అభిమానుల మనసు కొల్లగొట్టిన సిద్ధూ.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి కలెక్షన్స్ తెచ్చి పెట్టాడు. అప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షల్స్‌ను రాబట్టింది. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు డీజే టిల్లు 2 రాబోతుండడంతో ఆడియెన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ నమ్మకంతో మేకర్స్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.


Tags

Next Story