Lavanya Tripathi: నా పెళ్లి గురించి నాకంటే మీకే ఎక్కువగా.. : లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi:  నా పెళ్లి గురించి నాకంటే మీకే ఎక్కువగా.. : లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi: ఇక తన రాబోయే చిత్రం హ్యాపీ బర్త్‌డే గురించి మాట్లాడుతూ.. ఇది యాక్షన్ క్రైమ్ కామెడీ.. సాధారణ ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పింది.

Lavanya Tripathi: వరుసగా ఓ రెండు మూడు సినిమాల్లో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తే, వారి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో రూమర్లు రావడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే పరిస్థితి సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి విషయంలో కూడా ఎదురైంది.

అంతరిక్షం, మిస్టర్ చిత్రాల్లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించింది లావణ్య. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేసాయి. వీటిపై స్పందించినప్పటికీ రూమర్స్‌కి చెక్ పడడంలేదు. ఈ క్రమంలో మరోసారి ఈ వార్తలపై స్పందించింది.

వరుణ్ తేజ్‌తో పెళ్లి అని రాసేస్తున్నారు.. నా పెళ్లి గురించి నాక్కూడా తెలియదు..నా కంటే మీకే ఎక్కువగా తెలిసినట్లుంది అని ఇన్‌స్టాగ్రామ్ చాట్ సెషన్‌లో మాట్లాడింది. ఇక తన రాబోయే చిత్రం హ్యాపీ బర్త్‌డే గురించి మాట్లాడుతూ.. ఇది యాక్షన్ క్రైమ్ కామెడీ.. సాధారణ ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పింది. ఈ చిత్రంలో సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రంలో లావణ్యకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story