Aa Ammayi Gurinchi Meeku Cheppali : కొత్త కొత్తగా బాగుంది.. వినేయండి..!

Aa Ammayi Gurinchi Meeku Cheppali :  కొత్త కొత్తగా బాగుంది.. వినేయండి..!
X
Aa Ammayi Gurinchi Meeku Cheppali : ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'...

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'... మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌మార్క్‌ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా, కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది... ఇటీవలే విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొద్దిసేపటి క్రితమే సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

'అల్లంత దూరంగా నువ్వు .. నీ కన్ను నన్నే చూస్తుంటే' అంటూ ఈ పాట సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది.. పాటలో హీరోహీరోయిన్‌ మధ్య ప్రేమ, అల్లరిని చూపించారు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చైత్ర, అభయ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.



Tags

Next Story