Pushpa : పుష్ప మూవీని మిస్ చేసుకున్న అయిదుగురు స్టార్స్...!

Pushpa : పుష్ప మూవీని మిస్ చేసుకున్న అయిదుగురు స్టార్స్...!
Pushpa : ముందుగా ఈ సినిమాని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నారు సుకుమార్..

Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద అయితే ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఊహించని కలెక్షన్లను సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనితో అల్లు అర్జున్ క్రేజ్ ఇంకో లెవల్‌‌కి వెళ్ళిపోయింది. ఇదిలావుండగా ఈ సినిమాని వివిధ కారణాల వల్ల కొందరు స్టార్స్ ఈ సినిమాని వదులుకున్నారు.

ముందుగా ఈ సినిమాని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నారు సుకుమార్.. కానీ మహేష్ ఈ కథని రిజెక్ట్ చేయడంతో కొన్ని మార్పులతో అల్లు అర్జున్ వద్దకి వెళ్లారు సుకుమార్.. ఇక హీరోయిన్ గా సమంతని అనుకున్నారు.. కానీ ఆమె నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారు. సినిమాలోని ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పాటనీ ఫస్ట్ ఛాయిస్‌‌గా అనుకున్నారు.. కానీ ఆ ఆఫర్ బన్నీ సూచనతో సమంతకి వెళ్ళింది.

ఇక ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకి ముందుగా తమిళ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు.. ఆ తర్వాత డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్ లోకి ఫహద్ ఫాజిల్ వచ్చాడు. ఇక అల్లు అర్జున్ తర్వాత సినిమాలో అంత మంచి పేరు దక్కించుకున్న కేశవ పాత్రకి ముందుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ విట్టాను అనుకోగా చివరికి ఆ పాత్ర జగదీశ్ ప్రతాప్ బండారికి దక్కింది.

ఇక పుష్ప మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్ పైన ఫోకస్ పెట్టారు మేకర్స్. ఎక్కడ కూడా తగ్గకుండా సెకండ్ పార్ట్ ఉండేలా పక్కా పగడ్బంధీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story