టాలీవుడ్‌లో మార్మోగుతున్న జానపదం..రికార్డులు సృష్టిస్తున్న పాటలు ఇవే..
Folk Songs: ఒకప్పుడు పాట అంటే జానపదమే..పల్లె ప్రజలు జీవన విదానం ఈ జానపదం.

Folk Songs: ఒకప్పుడు పాట అంటే జానపదమే..పల్లె ప్రజలు జీవన విదానం ఈ జానపదం. అప్పటి ప్రజలు తమ రోజు వారి పనులలో బాగంగా ఈ జానపదాలని ఆలపించేవారు. అందుకే "పాట పనితో పాటే పుట్టింది" అంటారు. అప్పటి ప్రజలు, వారి జీవన విధానం, వేషదారణ, సంస్కృతి, సంప్రదాయాల మేలవింపుతో జానపదాలు వాడుకలో ఉండేవి. చప్పట్లు.. లయబద్దంగా ఆడించే కాలి అడుగుల శబ్దాలే సంగీతంగా వచ్చే జానపద పాటలు శ్రోతల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.
అయితే రానురాను సంగీతంలో వచ్చిన మార్పు వల్ల జానపదాలకి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఆధునిక వాయిద్యాలు, పాశ్చాత్య సంగీత పోకడల ప్రభావంతో జానపదం మరుగున పదిండి. సినిమా పాటలు, వాటిలో వచ్చిన మార్పులు, వెస్ట్రన్ మ్యూజిక్ మిక్సింగ్ వంటి వాటికి ప్రేక్షకులు కూడా సహజంగానే ఆకర్షితులైపోయారు. కొన్ని సినిమాలో అడపా, దడపా జానపద పాటలు వినిపించినా.. సినిమా పాటల ఆధిపత్యం మాత్రం ఎక్కువగా కనిపించేది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతూ వస్తుంది.
అయితే ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిపాయింది. తెలుగు సినిమాల్లో జానపదాల గేయాలను పెట్టుకునేంతగా మారిపోయింది. అందుకు నిదర్శనమే "సారంగా దరియ" పాట. ఈ మధ్యే విదుదలైన ఈ పాట జనాల్లో ఎంత క్రేజ్‌ని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. "లవ్ స్టొరీ" సినిమాలో బాగంగా వచ్చిన ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించి రికార్ద్ క్రియేట్ చేసింది.
అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "అలా వైకుంటపురంలో" సినిమాలో "రాములో..రాములా" అనే పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జానపదాల్లో ఎక్కువగా వినిపించే "రాములో..రాములా" అనే పదాలతో వచ్చిన ఈ పాట కుర్రకారుని ఒక ఊపు ఊపెసింది. ఇక "దిగు దిగు దిగు నాగా" పాట కూడా జానపదం నుంచి తీసుకున్నదే. అయితే వరుసగా వస్తున్న సినిమా పాటలన్నీ జానపదాల నుంచి స్ఫూర్తి పొందినవే అవడం.. అవి ఎక్కువగా వైరల్ అవ్వడం జానపద ప్రియులు హర్షించే విషయం.
ఇందులో భాగంగా వచ్చిన పాటనే "నీ బుల్లీట్ బండెక్కి వచ్చేత్తపా", ఈ గీతం "మోహనా భూగారాజ్" ఆలపించారు. ఈ పాట విడుదలై చాలా కాలం అయినా.. ఈ మద్య నవ వధువు పెళ్ళి బరాత్ లో వేసిన స్టేప్పులతో ఈ పాటకి మంచి ఉపు వచ్చింది. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ జానపదాల వైపు సంగీత ప్రియులు ఆకర్షితులు అవుతున్నట్లుగా కనిపిస్తుంది.
RELATED STORIES
Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ...
2 July 2022 5:58 AM GMTPatil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ ...
1 July 2022 12:30 PM GMTApple iPhone: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMTGold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
1 July 2022 5:35 AM GMTWorld's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత...
30 Jun 2022 7:42 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..
30 Jun 2022 6:08 AM GMT