Jason Vijay : ఒకే సినిమాలో నలుగురు వారసులు

Jason Vijay :   ఒకే సినిమాలో నలుగురు వారసులు
X

బాలీవుడ్ మొత్తం నెపోటిజమే అంటూ రకరకాల విమర్శలు వస్తున్నాయి కానీ.. అసలు నెపోటిజం లేని సినిమా పరిశ్రమ ఎక్కడుంది ఇప్పుడు. ఏ ఇండస్ట్రీ చూసినా వారసులదే కదా హవా. కాకపోతే బాలీవుడ్ మాత్రమే ఇందుకు టార్గెట్ అవుతుంది. ప్రాంతీయ భాషల్లో నెపోకిడ్స్ పేరెంట్స్ కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వార్తలను వాళ్లు కవర్ చేస్తుంటారు. తాజాగా కోలీవుడ్ లో నలుగురు నెపో కిడ్స్ కలిసి ఒకే సినిమా చేయబోతున్నారు.

కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తండ్రిలా హీరో కాకుండా దర్శకుడుగా మారాలనుకున్నాడు. ఇందుకోసం లండన్ లో చదువుకున్నాడు కూడా. అనుకున్నట్టుగానే జాసన్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్, హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ నటించబోతుండటమే పెద్ద సెన్సేషన్ గా మారింది. అంతేనా.. ఈ మూవీతో టాప్ మ్యూజీషియన్ ఏఆర్ రహమాన్ కొడుకు ఏఆర్ అమీన్ సంగీత దర్శకుడు. సో..నలుగురు బిగ్గీస్ వారసులు కలిసి ఒక సినిమాతో సంచలనం సృష్టించబోతున్నారా అంటే అవునని అంతా అనుకుంటారు కానీ.. ఇప్పుడు నెపోటిజం గురించి మాట్లాడుకునేవాళ్లకు ఈ కాంబినేషన్ ఒక పవర్ ఫుల్ వెపన్ లా మారింది.

Tags

Next Story