Sankranthi Movies : సంక్రాంతి సినిమాలు ఇవేనా

Sankranthi Movies :  సంక్రాంతి సినిమాలు ఇవేనా
X

సంక్రాంతి అంటే టాలీవుడ్ కు అతి పెద్ద సీజన్. అందుకే ఈ సీజన్ ను ఎక్కువగా పెద్ద స్టార్స్ ఆక్యూపై చేస్తుంటారు. అప్పుడప్పుడూ చిన్న హీరోలు కూడా వచ్చి కంటెంట్ తో కలెక్షన్స్ కొల్లగొట్టిన సందర్భాలూ ఉన్నాయి. అంచనాలను దాటి హిట్ అయ్యే మూవీస్ కూడా ఉంటాయి. ఇటు ఆడియన్స్ లో కూడా సంక్రాంతి మూవీస్ అంటే ఓ క్రేజ్ కనిపిస్తుంది. ఈ పండగకు సినిమా చూడటం కూడా తెలుగు వారికి ఓ సంప్రదాయం కాబట్టి టాక్ తో పనిలేకుండా అన్ని మూవీస్ ను చూస్తుంటారు. ఇక ఈ సారి మెగాస్టార్ విశ్వంభర ఫస్ట్ సంక్రాంతి డేట్ వేసినా .. రీసెంట్ గా రేస్ నుంచి తప్పుకుంది. కొత్తగా గేమ్ ఛేంజర్ యాడ్ అయింది. మరి ఈ సారి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలేంటో తెలుసా..

జనవరి 10న గేమ్ ఛేంజర్ ఫిక్స్ అయింది. ఈ డేట్ విశ్బంభరది. రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. జనవరి 12న బాలకృష్ణ 109వ సినిమా ఉంది. కానీ ఈ మూవీ టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. బట్ సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు. బాలయ్యను నెవర్ బిఫోర్ అవతార్ లో దర్శకుడు బాబీ చూపించబోతున్నాడనే టాక్ స్ట్రాంగ్ గా ఉంది.

జనవరి 14న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మూవీ ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ విడుదల కాబోతోంది. ఈ మూవీ టైటిల్ లోనే సంక్రాంతికి వస్తున్నాం అని ఉంది కాబట్టి.. ఆ డేట్ పక్కా అయిపోయింది. ఇక అదే రోజు లేదా తర్వాతి రోజు సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ ఉంది. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ పెద్దగా సందడేం లేదు కానీ .. చాలా రోజుల క్రితమే సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్ వేసుకున్నారు. సో.. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి.

Tags

Next Story