KanKhajura : సోనీ లివ్ లోకి ‘కన్‌ఖజురా’.. ఎప్పటి నుంచంటే..?

సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో రూపొందిన సిరీస్‘ఖన్ ఖజురా’. ఆ మధ్య విడుదలైప ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గోవా ప్రాంతాల్లో జరిగే నేరాల చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోంది. నిశ్శబ్దం మోసపూరితంగా ఉంటుంది.. అది బయటకు కనిపించే దాని కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనే పాయింట్ తో ఆకట్టుకునేలా ఉంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ని హిందీ ప్రేక్షకుల కోసం అనువదిస్తున్నారు. అయితే ‘కన్‌ఖజురా’ని ఇండియన్ ఆడియెన్స్ కోసం పూర్తిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే పోరు.. తమ చీకటి గతాన్ని ఎదుర్కోవలసి రావడం.. జ్ఞాపకశక్తి, వాస్తవికత మధ్యలో వారిద్దరూ నలిగిపోవడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది.
‘కన్‌ఖజురా’ పాత్రను పోషించిన రోషన్ మాథ్యూ మాట్లాడుతూ.. ‘ఈ ‘కన్‌ఖజురా’లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఈ కథలోని భావోద్వేగం, గందరగోళం కింద ఉన్న నిశ్శబ్దం వంటి అంశాలనే ఇందులో నన్ను నటించేలా చేశాయి. అషు అనే పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. క్షణానికో రకంగా మారుతుంటుంది. కానీ లోపల నిశ్శబ్ద తుఫాను ఉంటుంది. ఈ కథ అందరి హృదయాల్ని కదిలించడమే కాకుండా వెంటాడుతుంది’ అని అన్నారు.
అజయ్ రాయ్ నిర్మాతగా.. చందన్ అరోరా దర్శకత్వం వహించిన ‘కన్‌ఖజురా’లో మోహిత్ రైనా, రోషన్ మాథ్యూ, సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా మరియు ఉషా నద్కర్ణి వంటి వారు నటించారు. ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ మాగ్పీ ఆధారంగా ఈ షోను యెస్ స్టూడియోస్ లైసెన్స్‌తో సృష్టికర్తలు ఆడమ్ బిజాన్స్కీ, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్‌లు డోనా, షులా ప్రొడక్షన్స్ నిర్మించారు. ‘కన్‌ఖజురా’ మే 30 నుంచి సోనీ LIVలో మాత్రమే స్ట్రీమ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com