TFJA EYE Camp : TFJA ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఫిల్మ్ జర్నలిస్ట్ లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ‘ఐ స్క్రీనింగ్’ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైజింగ్ హీరో ప్రియదర్శి, డాషింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ చుక్కపల్లి అవినాష్ తో పాటు శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో ప్రియదర్శి, నిర్మాత నాగవంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాప్ ను ప్రారంభించారు. అవినాష్ చుక్కపల్లి, విశ్వ మోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై.జే రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రఘు జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ వైద్య శిబిరంలో ప్రియదర్శి కూడా కంటి పరీక్ష చేయించుకోగా.. ఆయన కంటి చూపు భేషూగ్గా ఉందని వైద్యులు తెలియజేశారు. ఇక ఈ శిబిరం గురించి ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘TFJA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ కు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జర్నలిస్ట్ ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోన్న అసోసియేషన్ పెద్దలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com