Freedom at Midnight : ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్: మంత్రముగ్ధులను చేసే కథనం

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది భారత స్వాతంత్ర్యానికి పూర్తం 1944 -1947 మధ్య కాలంలోని గందరగోళ పరిస్థితులను ఎంతో లోతుగా, సున్నితత్వంతో విశ్లేషిస్తుంది. ఇండియన్ ఫ్రీడమ్ జర్నీని గ్రిప్పింగ్ తో పాటు ఎమోషనల్ రీటెల్లింగ్‌ను అందిస్తుంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ ధారావాహిక ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన రాజకీయ కుట్రలు, వ్యక్తిగత త్యాగాలు, సైద్ధాంతిక సంఘర్షణలను అన్వేషించడానికి చరిత్ర, నాటకీయత, యాక్షన్ లను మిళితం చేస్తుంది.
ఈ షో బలం అంతా కూడా దీని బ్యాలన్స్ డ్ స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది. నెహ్రూ, గాంధీ, పటేల్, మౌంట్ బాటన్ వంటి కీలక వ్యక్తులను సాధారణ మనుషులుగా మారుస్తుంది. అదే సమయంలో భారతదేశ భవిష్యత్తు కోసం వారి విరుద్ధమైన దృక్పథాలను చిత్రీకరిస్తుంది. నెహ్రూ ఆధునికవాద ఆశయాలు, గాంధీ అచంచల ఆదర్శ వాదం, పటేల్ వ్యావహారిక సత్తావాదం గురించి చాలా క్షుణ్నమైన వివరాలతో రూపొందించడబడ్డాయి. ఇవన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఈ షో లో నటుల నటన అసాధారణమైంది. సిధాంత్ గుప్తా నెహ్రూ పాత్రలో జీవించారు. చిరాగ్ వోహ్రా సాధి కారికతతో కూడిన నటనతో గాంధీ పాత్రకు జీవం పోశారు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, జిన్నాగా ఆరిఫ్ జకారియా ఆ పాత్రల గాఢతను తమ నటనతో అద్దం పట్టారు. అదేవిధంగా ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా మౌంట్ బాటెన్ గా, లేడీ మౌంట్ బాటెన్ గా మెరిసిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com