Nani : నాని, అనిరుధ్ రెమ్యూనరేషన్స్.. గ్యాంగ్ లీడర్ టు ప్యారడైజ్..

Nani :  నాని, అనిరుధ్ రెమ్యూనరేషన్స్.. గ్యాంగ్ లీడర్ టు ప్యారడైజ్..
X

నేచురల్ స్టార్ నాని మాస్ మంత్రం జపిస్తున్నాడు. మాస్ హీరో అనిపించుకోవాలని శ్యామ్ సింగరాయ్ నుంచి అదే పనిగా ప్రయత్నిస్తున్నాడు. దసరాతో ఊరమాస్ గెటప్ తో మెప్పించాడు. సరిపోదా శనివారంతో సీరియస్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హిట్ 3, ద ప్యారడైజ్ అనే మూవీస్ తో వస్తున్నాడు. ఈ రెండూ కూడా మాస్ తో పాటు ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేసినవే.

అయితే ఎంచుకున్న ఏ రంగంలో అయినా ఎదగడం ఇంపార్టెంట్. సినిమాల్లో అయితే హిట్స్ కొడుతూ రేంజ్ మార్చుకుంటూ ఇమేజ్ తో పాటు రెమ్యూనరేషన్స్ పెంచుకుంటూ పోతే ఎదుగుతున్నారు అంటారు. అలా చూస్తే ద ప్యారడైజ్ కు మ్యూజిక్ చేస్తోన్న అనిరుధ్ తో పాటు నాని ఈ మూవీకి గతంలో చేసిన నాని గ్యాంగ్ లీడర్ తో పోలిస్తే.. చాలా పెద్ద వేరియేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా వారి రెమ్యూనరేషన్స్ పరంగా.

నాని, అనిరుధ్ కలిసి చేసిన గ్యాంగ్ లీడర్ మూవీ కమర్షియల్ గా పోయింది. ఆ టైమ్ లో వీరి రెమ్యూనరేషన్స్ చూస్తే.. నానికి 8 - 9 కోట్ల మధ్య ఉంది. అటు అనిరుధ్ కు 2.5 - 3 కోట్ల మధ్య ఉంది. ఆ తర్వాత ఇద్దరూ మాస్ మూవీతో తమ రేంజ్ ను మార్చుకున్నారు. అనిరుధ్ అయితే మ్యూజిక్ తోనే వంద కోట్లు అందిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇటు నాని కాన్ స్టంట్ గా మెప్పిస్తున్నాడు. అందుకే గ్యాంగ్ లీడర్ తర్వాత చేస్తోన్న ఈ మూవీకి వారి రెమ్యూనరేషన్స్ చూస్తే ఇది కదా ఎదగడం అనిపిస్తుంది.

ద ప్యారడైజ్ చిత్రానికి నాని తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ 35 కోట్లకు పైనే అంటున్నారు. అటు అనిరుధ్ ఈ చిత్రానికి 15 కోట్లు డిమాండ్ చేశాడు. నిర్మాతలు ఓకే అన్నారు. మామూలుగా అయితే అనిరుధ్ 12 కోట్ల వరకూ కోట్ చేస్తాడు. ప్యారడైజ్ కు మాత్రం 15 డిమాండ్ చేసి సాధించాడు. అదీ.. గ్యాంగ్ లీడర్ టైమ్ కు ద ప్యారడైజ్ కు మధ్య వీరు సాగించిన విజయ యాత్రే ఈ డిమాండ్స్ కు కారణం అని వేరే చెప్పక్కర్లేదేమో.

Tags

Next Story