Allu Arjun: నాలుగేళ్లలో తన రికార్డును తానే తిరగరాసిన బన్నీ..

Allu Arjun (tv5news.in)
Allu Arjun: ప్రస్తుతం టాలీవుడ్‌లో పుష్ప జోరు కొనసాగుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్, సుకుమార్‌లపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుండి తన స్టైల్‌ను మార్చేసి పూర్తిగా మాస్ లుక్‌లోకి మారిపోయిన బన్నీ.. పుష్పరాజ్ పాత్ర కోసం చాలానే కష్టపడినట్టు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా పుష్పతో బన్నీ తన పాత రికార్డును చెరిపేసి కొత్త రికార్డును సృష్టించాడు.
పుష్ప ఫస్ట్ లుక్ నుండి పాటల వరకు అన్నీ రికార్డ్ స్థాయిలో ప్రేక్షకుల దగ్గర నుండి ఆదరణ పొందుతున్నాయి. ముందుగా పుష్ప టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. అంతకంటే ముందు టీజర్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికి 'ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్' అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. పుష్ప సినిమా నుండి వచ్చిన మొదటి అప్డేట్ ఇదే. అందుకే అతి తక్కువకాలంలోనే ఈ గ్లింప్స్‌కు 2 మిలియన్ల లైకులు వచ్చాయి.
నాలుగేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా విడుదలయిన చిత్రం 'డీజే'. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో కనిపించాడు బన్నీ. అయితే ఈ సినిమా ఎందుకో కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డీజే సినిమా టీజర్ విడుదలయిన కాసేపట్లోనే లైకుల కంటే ఎక్కువగా డిస్‌లైకులే వచ్చాయి. అయితే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా మెస్ట్ లిస్‌లైక్ టీజర్ దగ్గర నుండి మోస్ట్ లైక్ గ్లింప్స్ వరకు బన్నీ కెరీర్ ఎంతగానో మారిందని అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com