ఈ చంద్రమోహన్ హీరోయిన్ గుర్తుందా.. మన తెలుగమ్మాయే.. !

ఈ చంద్రమోహన్ హీరోయిన్ గుర్తుందా.. మన తెలుగమ్మాయే.. !
కొందరు హీరోయిన్లు సొంత బాషలో మెప్పించకపోయిన పరబాషలో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారిలో తెలుగమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు.

కొందరు హీరోయిన్లు సొంత బాషలో మెప్పించకపోయిన పరబాషలో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారిలో తెలుగమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు అంజలి అచ్చ తెలుగమ్మాయి... కానీ తమిళ్‌‌లో ముందుగా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఆమెకి అవకాశాలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌‌లో హీరోయిన్‌‌గా ఒకే ఒక సినిమా చేసి.. ఆ తర్వాత హిందీ, ఒడియా బాషల్లో నటించి మంచి హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకుంది తాళ్ళూరి రామేశ్వరి. తిరుపతికి చెందిన ఈమె ముందుగా హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి (1978) సినిమాలో హీరోయిన్‌‌‌గా నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకి గాను రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుని ఇచ్చి సత్కరించింది.

ఈ సినిమా తర్వాత ఆమెకి తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని హిందీ, ఒడియా భాషల్లో హీరోయిన్‌‌‌గా సినిమాలు చేశారు. ఇక మహేష్‌‌‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో మహేష్‌‌‌కి తల్లిగా నటించి మెప్పించారు రామేశ్వరి. ఈ సినిమాలోని ఆమె పాత్రకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ సినిమాకి గాను ఆమెకి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు రామేశ్వరి. ఇక పంజాబీ నటుడు, నిర్మాత దీపక్ సేథ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు రామేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

తన మాతృభాష తెలుగు అయినప్పటికీ, తనకు పేరుతెచ్చిన హిందీ సినిమాలుకు కాకుండా పంజాబీ సినిమాలెందుకు తీస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించినప్పుడు తెలుగు, హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని, తాము అంత రిస్కును భరించలేమని ఆమె చెప్పుకొచ్చింది. కాగా తాళ్ళూరి రామేశ్వరి అమెరికా అమ్మాయి అనే తెలుగు సీరియల్‌‌లో కూడా నటించింది.

Tags

Next Story