National Film Awards 2023: పుష్ప సంచలనం.. పూర్తి వివరాలు ఇవే..!

69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగోడు సత్తా చాటాడు.. 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను బెస్ట్ హీరో అవార్డు వరించింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప పార్ట్-1 ప్యాన్ ఇండియా లెవల్‌లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సినిమా ప్రేక్షకుడే కాదు..రాజకీయ నేతలు, క్రీడాకారులు కూడా తగ్గేదేలే డైలాగ్‌తో రచ్చ చేశారు. ఇక పుష్ప సినిమాలోని పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు దక్కింది.
తెలుగు సినిమాను ప్రపంచ పటాన నిలబెట్టిన ట్రిపుల్ ఆర్‌కు సినిమాకు ఆవార్డుల పంట పండింది. మొత్తంగా ఈ సినిమాకు 6 అవార్డులు దక్కాయి. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ ఇప్పటికే ఆస్కార్ గెలుచుకుంది.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్‌కు..నాటు నాటు పాటకు గాను ఉత్తమ డ్యాన్స్ కొరియో గ్రాఫర్‌గా ప్రేమరక్షిత్‌కు అవార్డు దక్కింది. ఈ సినిమాకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్, ఉత్తమ గాయకుడిగా కాలభైరవ, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో కీరవాణికి అవార్డులు దక్కాయి.
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిస్తే.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించారు. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టికి ఉప్పెన తొలి చిత్రం. ఇక వైష్ణవ్‌తేజ్ నటించిన మరో చిత్రం కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు గాను ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ జాతీయ అవార్డు దక్కింది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. ఇక తెలుగు నుంచి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు అవార్డ్ దక్కింది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా మాధవన్ నటించి దర్శకత్వం వహించిన రాకెట్రీ అవార్డు దక్కించుకుంది.. ఈసారి ఉత్తమ నటి అవార్డులు ఇద్దరికి ప్రకటించారు. గంగుభాయి కతియా వాడి సినిమాలోని అద్భుత నటనకు అలియా భట్‌కు..మిమీ సినిమాలోని నటనకు కృతి సనన్‌కు బెస్ట్ హీరోయిన్ అవార్డులు వచ్చాయి. ప్రాంతీయ చిత్రాల విభాగంలో హిందీ నుంచి సర్దార్ ఉద్దమ్, కన్నడ నుంచి 777 చార్లీ, తమిళం నుంచి కడైసి వ్యవసాయి సినిమాలకు అవార్డులు వచ్చాయి. 2021 ఏడాదికి గాను మొత్తం 24 కేటగిరీల్లో జాతీయ అవార్డులు ప్రకటించారు.
69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన
జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగోడి సత్తా
69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డు
జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటిగా అలియా భట్, కృతిసనన్
ఉత్తమ చిత్రంగా రాకెట్రీ (మాధవన్ హీరో, దర్శకత్వం)
ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప)
ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట
ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్
ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గాయకుడిగా కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన (తెలుగు)
ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) అవార్డ్ పురుషోత్తమాచార్యులు
2021 ఏడాదికి 24 కేటగిరీల్లో జాతీయ అవార్డులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com