Gabbar Singh : దుమ్మరేపిన గబ్బర్ సింగ్.. 6 కోట్లు పైగానే గ్రాస్ వసూలు

పవర్ స్టార్ పుట్టిన రోజు రీ రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ ఏపీ, తెలంగాణలో దుమ్మరేపింది. కలెక్షన్ల ఊచ కోతతో రికార్డులు బద్దలు కొట్టింది. వరదల ప్రభావం కారణంగా వెనుకబడుతుందని భావించినా వర్షా లను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు. ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రీ రిలీజైన సినిమాల్లో అత్యధిక నంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల గ్రాస్ దాటేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ సముదాయాలలో పది లక్షలకు పైగా వసూలైనట్టు తెలిసింది. ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులోనూ దుమ్ము దులిపింది. మురారిని దాటాలనుకున్న లక్ష్యం సులభంగా నెరవేరుతోంది. ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీలైతే కచ్చితంగా ఉంటాయి. వీకెండ్లో కొత్త సినిమాల రిలీజ్ ఉన్నందున గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com