బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న గదర్ 2

సన్నిడియోల్, అమీషా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన గదర్ 2 సినిమా బాక్సాఫీస్ దుమ్మురేపుతుంది.బీ,సీ సెంటర్‌ల జనాలను మెప్పించ గలిగితే ఆ సినిమా కలెక్షన్‌లు మన ఊహకు కూడా అందని రేంజ్‌లో ఉంటాయి.అలాంటి ప్రదర్శననే కొనసాగిస్తుంది గదర్-2 సినిమా.మూవీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది.500కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న గదర్ 2 ఇప్పటికే 434 కోట్లు వసూలు చేసింది. అటు కేజీఎఫ్2 గ్రాస్‌ను క్రాస్ చేసిన గదర్ 2..దంగల్, బాహుబలి రికార్డుల బ్రేక్ చేస్తుందంటున్న సినీ పండితులు అంచనా వేస్తున్నారు.ఈ మూవీ రిలీజ్ కు ముందే టీజర్లు, ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్, ఆక్యుపెన్సీ వచ్చాయి. ఆగస్టు 11న మూవీ రిలీజైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇక గదర్ 2 సినిమా అందరి అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు 434 కోట్ల మార్క్ దాటి సన్నీ డియోల్ మూవీస్‌లో టాప్ కలెక్షన్లతో దూసుకు పోతూ మొత్తం 65.40 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.మరో రెండు రోజుల్లో 5 వందల కోట్లు సాధించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.2001లో వచ్చిన గదర్-ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి రీమేక్ గా గదర్ 2 తెరకెక్కింది. 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు.మళ్లీ 22 ఏళ్ల తర్వాత వచ్చిన గదర్ 2కు కూడా అనిల్ శర్మ డైరెక్షన్ చేశారు. విశేషం.శక్తిమాన్ తల్వార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు.
హిందీలో మాస్ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. బీ, సీ సెంటర్‌లలో ఈ లోటు క్లీయర్‌గా కనిపించింది. అయితే గదర్-2తో ఆ లోటు . ఈ సినిమా ప్రభావం జనాలపై ఎందుందంటే.. థియేటర్‌లకు ట్రాక్టర్‌లలో వెళ్లేంతలా ఉంది. పంజాబ్ లో అయితే ఊళ్లకు ఊళ్లు తరలివెళ్లి దగ్గర్లోని పట్టణాలలో సినిమా థియేటర్లలో సినిమాను చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com