Gadar: రెచ్చగొట్టే సినిమా అన్న షబానా అజ్మీ, సన్నీ సీరియస్

Gadar: రెచ్చగొట్టే సినిమా అన్న షబానా అజ్మీ, సన్నీ సీరియస్
గదర్ సినిమాపై షబానా అజ్మీపై కీలక వ్యాఖ్యలు.. స్పందించిన సన్నీ డియోల్

బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన 'గదర్ ఏక్ ప్రేమ్ కథ' వివాదాస్పద చిత్రం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 'గదర్: ది కథ కంటిన్యూస్' అనే సీక్వెల్‌లో తారా సింగ్‌గా తిరిగి వస్తున్నాడు. 'గదర్ 2' విడుదలకు షబానా అజ్మీ ఈ చిత్రాన్ని రెచ్చగొట్టేలా చిత్రీకరించారని విమర్శించగా.. సన్నీ డియోల్ తీవ్రంగా స్పందించారు. ఆమెను మరింత ఎదగాలని సూచించినట్టు తెలుస్తోంది. గదర్.. ఒక సిక్కు వ్యక్తి ముస్లిం పాకిస్తానీ మహిళను వివాహం చేసుకోవడం చుట్టూ ఈ కథ సాగుతుంది. 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ కథను రూపొందించారు.

ఈ చిత్రం భారతీయ, పాకిస్థాన్ వ్యక్తుల ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. అంతే కాకుండా హిందీ-ముస్లిం విభేదాలను రేకెత్తిస్తుంది. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కథాంశం కారణంగా అనేక వివాదాలకు దారితీసింది. 2001లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమాజంలోని ఒక వర్గానికి అంతగా నచ్చలేదు. సినిమాలో ముస్లింలను విలన్‌లుగా, హిందువులను బాధితులుగా చిత్రీకరిస్తున్నట్లు అనిపించింది. ఇది హిందూ అహంకార సందేశాన్ని పంపే జాతీయ చిత్రంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో షబానా అజ్మీతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమా ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు.

ఉదారవాది అయిన షబానా అజ్మీ 2001లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "గదర్ అనేది రెచ్చగొట్టే సినిమా" అని ఆరోపించారు. పొరుగు దేశాల మధ్య పరిస్థితులను సడలించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ సినిమా తీయడంలోని తెలివితేటలను కూడా ఆమె ప్రశ్నించింది. స్క్రీన్‌ప్లేపై వ్యాఖ్యానిస్తూ, అమ్మాయి తండ్రి విలన్ కాదని ఆమె భావిస్తోంది. ఈ చిత్రం ప్రతి ముస్లింను పాకిస్థానీగా చిత్రీకరిస్తుందంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ చిత్రం జాతీయవాదం, మతం, ఐడెంటిటీ వంటి సమస్యలను ఎలా గందరగోళానికి గురిచేస్తుందో కూడా అజ్మీ చెప్పారు. అయితే విభజన అనేది పరిష్కరించాల్సిన సమస్య అని తాను నమ్ముతున్నానని షబానా పేర్కొన్నారు. సినిమాకు వ్యతిరేకంగా నిషేధించాలని మాత్రం తాను ప్రచారం చేయలేదని, ఈ తరహా ప్రచారానికి తాను వ్యతిరేకమని ఆమె వివరించింది.

షబానా అజ్మీ మాటలకు సన్నీ డియోల్ తాజాగా ఆమెపై విరుచుకుపడ్డారు. సినిమాపై రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం కంటే ఆమె ఇంకా బాగా చదువుకుని ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. వార్తల్లో నిలవడం కోసమే ప్రజలు సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. 'గదర్' సినిమాలో ఏ తప్పూ లేదని దానికి వచ్చిన విజయమే ఫ్రూ చేసిందన్న సన్నీ.. ఈ చిత్రం విభజన సమయంలో సెట్ చేయబడిందని, అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీసేందుకు లేదా ఇబ్బందులను సృష్టించడానికి రూపొందించబడలేదని వివరించారు. తన సినిమాను సమర్థించుకున్న సన్నీ.. దాన్ని దేశ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని భావించే వ్యక్తుల మనస్సులను వక్రీకరించారన్నారు. విభజనను తన తాతలు చూశారని, మళ్లీ నరమేధం పునరావృతం చేయడానికి తాను అలాంటి పనులు చేయనని అతను ఒప్పుకున్నాడు.

'గదర్ 2'.. 2001లో వచ్చిన తారా సింగ్, సకీనాల కథను కొనసాగిస్తుంది. సీక్వెల్‌లో ప్రధాన నటులు తమ పాత్రలను మళ్లీ ప్రదర్శించనున్నారు. 'గదర్: ది కథ కంటిన్యూస్' గా రాబోతున్న ఈ సినిమా 11 ఆగస్టు 2023న థియేటర్లలో విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story