RC: విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్.. గిన్నీస్ రికార్డు..!

గ్లోబల్‌స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ వజ్ర గ్రౌండ్‌లో 256 అడుగుల ఎత్తు వరకు రాంచరణ్ కటౌట్‌ను నెలకొల్పారు. రాంచరణ్ పేరిట గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డు ఉండాలనే లక్ష్యంతో ఈ భారీ కటౌట్‌ను రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నెలకొల్పామని అభిమానులు తెలిపారు. గేమ్‌ఛేంజర్ వేడుకల్లో కటౌట్‌ను ప్రారంభించనున్నారు. . దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశామని.. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్రబృందానికి సంబంధించిన పలువురు సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.
జనవరి 10న గేమ్ ఛేంజర్
సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్‌రాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com