Game Changer : గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ క్రేజీ అప్డేట్స్

Game Changer :  గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ క్రేజీ అప్డేట్స్
X

ఒకప్పుడు కంట్రీని ఊపేసిన సినిమాలు తీసిన శంకర్ ఇప్పుడు డల్ అయ్యాడు. అతని మార్క్ మిస్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా భారతీయుడు 2 చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. శంకర్ లో స్టఫ్ అయిపోయింది అనేశారు ఏకంగా. ప్రస్తుతం రామ్ చరణ్ తో అతను రూపొందించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల కాబోతోంది. భారతీయుడు 2 ఎఫెక్ట్ ఈ మూవీపై స్పష్టంగా కనిపిస్తోంది. చాలా తక్కువ బజ్ ఉందీ చిత్రానికి.

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయొల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక పాత్ర పాలిటిక్స్ లో ఉంటే మరో పాత్ర ఐఏఎస్. ఈ రెండు పాత్రలూ అద్భుతంగా వచ్చాయి అంటున్నారు. కలెక్టర్ సరసన కియారా అద్వానీ, పొలిటీషియన్ సరసన అంజలి హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రల్లో శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునిల్, ప్రకాష్ రాజ్ నటించారు. ప్రస్తుతం పెద్దగా హైప్ లేకున్నా.. సినిమా చూశాక మొదటి ఆటకే అంతా మారిపోతుందంటున్నారు.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ ఎప్పట్లానే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ గురించి బాగా చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించే ఆలోచన ఉందని చెప్పాడు. అలాగే భారతీయుడు 2పై వచ్చిన రివ్యూస్ బాధపెట్టాయని చెప్పాడు. అలాగే భారతీయుడు 3 గురించి కీలకమైన అప్డేట్ చెప్పాడు. సెకండ్ పార్ట్ రిజల్ట్ చూసి ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేస్తారు అనే టాక్ బలంగా వినిపించింది. బట్.. ఓటిటి కాదు.. ఖచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నాం అనే క్రేజీ అప్డేట్ ఇచ్చాడు శంకర్.

కోలీవుడ్ సర్కిల్స్ ప్రకారం చూస్తే.. భారతీయుడు 3 ఓ రేంజ్ లో వచ్చిందంటున్నారు. ఫస్ట్ పార్ట్ లాగా స్వాంతంత్ర్య పోరాట ఘట్టాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని.. ఆ పార్ట్ లో సంగీతం కూడా బావుందంటున్నారు. అందుకే థియేట్రికల్ రిలీజ్ అయితే ఈ సారి రిజల్ట్ వేరే ఉంటుందనే టాక్ కూడా ఉంది. ఈ పార్ట్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

అయితే అవన్నీ మాకెందుకు.. గేమ్ ఛేంజర్ బావుంటే అదే పదివేలు అనేది మెగా ఫ్యాన్స్ ఫీలింగ్.

Tags

Next Story