Game Changer : హిందీలో గేమ్ ఛేంజర్ హవా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్.జే సూర్య, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన గేమ్ ఛేంజర్ కు హిందీలో మంచి ఆదరణ వస్తోంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ కు అక్కడి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2కు పూర్తి భిన్నంగా ఉండటంతో పాటు రామ్ చరణ్ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తో అక్కడి ప్రేక్షకులకు బాగా తెలిసి ఉండటం, దీనికి తోడు రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతమైన నటన నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
మొదటి రోజు కలెక్షన్స్ తోనే ట్రేడ్ ను ఆశ్చర్యపరిచిన గేమ్ ఛేంజర్ ఆ సర్ ప్రైజెస్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. వారం కూడా పూర్తి కాక ముందే 100 కోట్లు సాధించిందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు ఈ మేరకు గేమ్ ఛేంజర్ 100 కోట్లు కొల్లగొట్టిందనే వార్తలు రాస్తున్నాయి. నిజానికి మొదటి రోజు 8 కోట్లకు పైగా వసూలు చేసిన గేమ్ ఛేంజర్ తర్వాత ఆ నంబర్స్ ను పెంచుకుంటూనే పోయింది. వీకెండ్ లో స్ట్రాంగ్ గా కనిపించింది. వీక్ డేస్ లో పండగ కూడా ఉండటంతో ఆ కలెక్షన్స్ మరింత పెరిగాయి అంటున్నారు. మరి ఈ కలెక్షన్స్ ను మేకర్స్ కూడా అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com