Game Changer : అప్పుడే ఆన్ లైన్ లో గేమ్ ఛేంజర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో ఈ శుక్రవారం విడుదలైంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అంజలి, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ కు ముందు భారీ అంచనలున్నా.. రిలీజ్ తర్వాత మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. కాకపోతే పండగ సీజన్ కాబట్టి ఈజీగా పాస్ అయిపోతుందనుకోవచ్చు. అయితే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చిందనే బాధలో ఉన్న మేకర్స్ కు తాజాగా పైరసీగాళ్లు ‘హెచ్.డి’ షాక్ ఇచ్చారు.
400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన గేమ్ ఛేంజర్ హెచ్.డి ప్రింట్ వెర్షన్ ను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. అసలు ఒక్క రోజు కూడా గడవకుండానే ఇదెలా సాధ్యం అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీస్ కు టికెట్ ధరలు కూడా బాగానే ఉంటాయి. అందుకే ఇలాంటి డొంకతిరుగుడు ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ వెనకాడరు. కానీ ఇవి సినిమాకు చాలా అంటే చాలా నష్టాలనే తెస్తాయి. నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ను నిండా ముంచేస్తాయి. మరి ఈ మూవీ టీమ్ వీలైనంత త్వరగా మేల్కొని దీనికి అడ్డుకట్ట వేయకపోతే గేమ్ ఛేంజర్ కూ లాస్ లు తప్పవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com