Ram Charan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ డేట్, వెన్యూ ఫిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అనేక అవాంతరాలు, వాయిదాలు దాటుకుని ఫైనల్ గా సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల కాబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్. ప్రకాష్ రాజ్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జే సూర్య, సునిల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకూ గేమ్ ఛేంజర్ పై ఆశించినంత బజ్ క్రియేట్ కాలేదు. అందుకు శంకర్ ప్రీవియస్ మూవీ భారతీయుడు 2 ఓ కారణమైతే.. అనుకున్న దానికంటే యేడాది వరకూ ఆలస్యం కావడం మరో రీజన్. దీంతో ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీపై పెద్దగా నమ్మకం లేదుఅంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కనిపిస్తుంటాయి. బట్ ఓ సాలిడ్ ఫంక్షన్ జరిగితే బజ్ సినిమాను వెదుక్కుంటూ అదే వస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. జనవరి 4న ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ మేరకు ఈ రెండు అంశాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.
డిప్యూటీ సిఎమ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ కు అటెండ్ కాలేదు. తన అన్న కొడుకు సినిమా కాబట్టే అని కాదు కానీ.. తను ప్రాతినిధ్యం వహిస్తోన్న గోదావరి జిల్లాల సెంటర్ పాయింట్ అయిన రాజమండ్రిలో జరుగుతోంది కాబట్టి వెళుతున్నాడు. ఈ సినిమా రాజకీయాలపై సెటైర్ లా ఉంటుందనే టాక్ ఉంది. పైగా రామ్ చరణ్ అప్పన్న అనే పొలిటీషియన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరో పాత్ర ఐఎఎస్ గా ఉంటుంది. అందుకే పవన్ ఈ మూవీతో పాటు సమకాలీన రాజకీయాలపైనా కామెంట్స్ చేసే అవకాశం ఉంది. అవి ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతాయి. అందుకే ఆ ప్లేస్, చీఫ్ గెస్ట్ మేటర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com