Game Changer : గేమ్ ఛేంజర్ ఈవెంట్.. ఆర్గనైజర్స్ తో పాటు అభిమానులు కూడా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ రాజమహేంద్ర వరంలో నిర్వహించబోతున్నారు. దీనికి ఏపి డిప్యూటీ సిఎమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు. చిరంజీవి కూడా వెళతాడు అనే టాక్ ఉంది. కానీ కన్ఫార్మ్ చేయలేదు. చరణ్, పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యాన్స్ భారీగా అటెండ్ అవుతారు. ఇది తొక్కిసలాటకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. అసలు రీసెంట్ గా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం.. తర్వాత అల్లు అర్జున్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ చూస్తున్నాం. మరోసారి అలాంటి దుర్ఘటన జరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. ఇందుకోసం కేవలం ఆర్గనైజర్స్ మాత్రమే కాదు.. అభిమానులు కూడా బాధ్యతగా ఉండాలి. స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఎవరికి వాళ్లు బాధ్యతగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అలా కాదని అదే పనిగా ఎగబడుతూ అవతలి వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే నిర్వాహకులకు అభిమానులు సహకరించాలి.. అభిమానులకు నిర్వాహకులు సమస్యలు లేని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఎలాంటి సమస్యా రాదు.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ పరంగా చూస్తే శంకర్ డైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 10న విడుదల కాబోతోంది. సంక్రాంతి బరిలో మోస్ట్ హైప్డ్ మూవీగా ఉంది గేమ్ ఛేంజర్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కియారా అద్వానీ, అంజలి, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించిన గేమ్ ఛేంజర్ కు థమన్ సంగీతం అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com