Game Changer : గేమ్ ఛేంజర్ సంక్రాంతికే

Game Changer : గేమ్ ఛేంజర్ సంక్రాంతికే
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అందరూ ఊహించినట్టుగా డిసెంబర్ 20న కాకుండా జనవరి 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాలు మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story