GameChanger : ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టిన గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ భారీ ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. ప్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ లోని పవర్స్, లూప్ హోల్స్ ను చూపిస్తూ శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ కు ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ వచ్చాయి.ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ఇండియా హీరోగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మొదటి రోజు వసూళ్లతో ఆ క్రేజ్ ను నిలబెట్టుకోబోతున్నాడని అర్థం అవుతోంది.
గేమ్ ఛేంజర్ కు పాటల, ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్ తో పాటు రామ్ చరణ్ నటన మెయిన్ హైలెట్ గా, ఎస్.జే సూర్య విలనీ ఎసెట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది అనే టాక్ వచ్చినా.. అప్పన్న పాత్రలో రామ్ చరణ్, పార్వతిగా అంజలి అదరగొట్టారు. థమన్ నేపథ్య సంగీతం బ్యాక్ బోన్ నిలిస్తే.. జరగండి జరగండి అనే పాటలో శంకర్ మార్క్ విజువల్ గ్రాండీయర్ ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ గా నిలిచింది.
ఈ కారణంగానే గేమ్ ఛేంజర్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 186 కోట్ల వసూళ్లు సాధించింది ఓపెనింగ్ అదుర్స్ అనిపించుకుంది. ఈ కలెక్షన్స్ రెండో రోజు కూడా కంటిన్యూ అవుతాయి అనేలా ఉంది సిట్యుయేషన్. వీకెండ్ తో పాటు వీక్ డేస్ అంతా సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి గేమ్ ఛేంజర్ దూకుడు కొనసాగే అవకాశాలున్నాయనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com