Game Changer Teaser : దసరాకి 'గేమ్ ఛేంజర్' టీజర్?

Game Changer Teaser : దసరాకి గేమ్ ఛేంజర్ టీజర్?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం గేమ్ ఛేంజర్. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన రా మచ్చ మచ్చ సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే గేమ్ ఛేంజర్ టీజర్ అక్టోబర్ 12 దసరా కానుకగా విడుదల చేయనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానుంది. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story