Thammudu : తమ్ముడిని ముంచిన గేమ్ ఛేంజర్

ప్రమోషన్ అంటే సినిమాపై హైప్ పెంచేదిగా ఉండాలి. మాటలు జారితే అసలుకే మోసం వస్తుంది. ఈ విషయం తమ్ముడు నిర్మాతలు ‘దిల్ బ్రదర్స్’కు బాగా అర్థం అయింది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో అదే పనిగా గేమ్ ఛేంజర్ నష్టాలను గురించి మాట్లాడారు. శిరీష్ రెడ్డి ఏకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి హీరో రామ్ చరణ్ కనీసం మాకు ఫోన్ చేయలేదు అని నిష్టూరంగా మాట్లాడాడు. ఇది కాస్తా మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. అంతే ‘చివరి హెచ్చరిక’అంటూ దిల్ రాజు బ్రదర్స్ ను ఉద్దేశిస్తూ ఒక లెటర్ విడుదల చేశారు. దీంతో తప్పు గ్రహించిన శిరీష్ రెడ్డి ఓ అపాలజీ లెటర్ వదిలాడు. అదీ సరిపోదని ఓ వీడియో బైట్ కూడా విడుదల చేశాడు. బట్ అప్పటికే డ్యామేజ్ అయింది. ఆ రెండు లెటర్స్ ను చూస్తూ తమ్ముడు కు సంబంధించిన టాపిక్ అంతా.. గేమ్ ఛేంజర్ వైపు వెళ్లిపోయింది. ఈ కారణంగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న తమ్ముడును పట్టించుకున్నవారే లేరు.
అసలే నితిన్ వీర ఫ్లాపుల్లో ఉన్నాడు. మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేడు. అలాంటి టైమ్ లో తమ్ముడిపై అనుకోని పిడుగులా పడింది గేమ్ ఛేంజర్ టాపిక్. దీంతో సినిమాకు మరింత నష్టం జరగబోతోందనేది క్లియర్ గా అర్థం అవుతోంది. సినిమా ఎక్స్ ట్రార్డినరీగా ఉంటే తప్ప తమ్ముడు బయటపడలేని పరిస్థితి ఉంది. అసలే నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. ఏ మాత్రం తేడా జరిగినా నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో నోరు అదుపులో ఉండాలి. లేదంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com