Darren Kent : గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు కన్నుమూత
'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు డారెన్ కెంట్ మరణించాడు. US-ఆధారిత వార్తా సంస్థ వెరైటీ ప్రకారం, కెంట్ ఆగస్టు 11న తుది శ్వాస విడిచాడు. ప్రస్తుతం ఆయన వయసు 30 ఏళ్లు. కాగా ఆగస్టు 15న పోస్ట్ చేసిన అతని టాలెంట్ ఏజెన్సీ కారీ డాడ్ అసోసియేట్స్.. అతని మరణ వార్తను ధృవీకరించింది. "మా ప్రియమైన స్నేహితుడు, క్లయింట్ డారెన్ కెంట్ ఆగస్టు 11న కన్నుమూశారని మేము మీకు చాలా బాధతో చెప్తున్నాం. అతని తల్లిదండ్రులు, బెస్ట్ ఫ్రెండ్ కూడా అతని పక్కనే ఉన్నారు. ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు, ప్రేమ అతని కుటుంబంతోనే ఉంటాయి. RIP మై ఫ్రెండ్" అని ఏజెన్సీ రాసుకువచ్చింది.
కెంట్.. ఎసెక్స్‌లో పుట్టి పెరిగాడు. 2007లో పట్టభద్రుడైన ఆయన.. మొదటి ప్రధాన నటనా పాత్ర 2008 భయానక చిత్రం 'మిర్రర్స్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఎమ్మీ-విజేత 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కనిపించాడు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ లో, కెంట్ స్లేవర్స్ బేలో మేకల కాపరి పాత్రలో నటించాడు. డారెన్ కెంట్ ఇటీవల వచ్చిన 'డంజియన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్'లో రీనిమేటెడ్ శవంగా కనిపించాడు. దీంతో పాటు ఆయన 'స్నో వైట్ అండ్ హట్స్‌మ్యాన్', 'మార్షల్స్ లా', 'బ్లడీ కట్స్', 'ది ఫ్రాంకైన్ స్టీన్ క్రోనిక్స్', 'లెస్ మిజరబుల్స్', 'బ్లడ్ డ్రైవ్', 'బర్డ్స్ సారో', 'గ్రీన్ ఫింగర్స్', 'ఈస్ట్‌ఎండర్స్', 'హ్యాపీ అవర్స్', 'లవ్ వితౌట్ వాల్స్' వంటి సినిమాల్లో నటించారు.
డారెన్ కెంట్ స్కిన్ కి సంబంధించిన ఒక రేర్ డిసీస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం వ్యక్తి శరీరంపై సూర్య కిరణాలు పడకూడదు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను శరీరం తట్టుకోలేదు. ఇవే తరహా సమస్యలను డారెన్ కెంట్ ఎదుర్కొన్నాడు. ఈ వ్యాధితో అనేక ఇబ్బందులు పడ్డాడు. అయినా తన నటనతో పలు హాలీవుడ్ సినిమాల్లో మెప్పించాడు. 'సన్నీబాయ్' సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా అందుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com