Gamechanger : గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

Gamechanger : గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

Gamechanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గేమ్ ఛేంజర్' . ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ భారీ చిత్రంలో కియార అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ డిసెంబర్ 20 న గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

రామ్ చరణ్ అభిమానులకు ఇది శుభవార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ అభిమాన హీరో సినిమా టీజర్‌ను దసరా కానుకగా చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్నారు. 'గేమ్ ఛేంజర్' చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags

Next Story