గాండీవ ధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్..

గాండీవ ధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్..
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన గాండీవ ధారి అర్జున ఎలాంటి హంగామా లేకుండా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది.

వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన గాండీవ ధారి అర్జున ఎలాంటి హంగామా లేకుండా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఆన్ లైన్ టికెట్స్ ప్రకారం ఇప్పటికే 70 లక్షల గ్రాస్ ని అందుకోగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సినిమా 1 కోటి రేంజ్ కి అటు ఇటుగా పెరిగే అవకాశం ఉంది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు.

చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీనికి దాదాపు రూ. 42 కోట్లు వరకూ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story