Gandeevadhari Arjuna Trailer : 'భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో.. భారీ యాక్షన్ సీన్స్ లో వరుణ్

Gandeevadhari Arjuna Trailer : భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో.. భారీ యాక్షన్ సీన్స్ లో వరుణ్
X
'గాండీవధారి అర్జున' ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన మెగా ప్రిన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ 'గాండీవధారి అర్జున' ట్రైలర్ రిలీజైంది. స్పై యాక్షన్ మూవీగా రాబోతున్న ీ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్నారు. కాగా ఆగస్టు 25న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ మేకర్స్.. అభిమానులకు బిగ్గెస్ట్ బూస్టప్ ను అందించారు.

గాండీవధారి అర్జున ట్రైలర్ విషయానికొస్తే.. మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌లతో వీడియో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ మోడ్‍లో హీరో వరుణ్ తేజ్ అదరగొట్టాడనే టాక్ వినిపిస్తోంది. “డిసెంబర్ 2020లో దేవుడి మీద మనిషి గెలిచాడంట. జస్ట్ పాతిక వేల సంవత్సరాల్లో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట.. ఎలాగో తెలుసా” అంటూ సీనియర్ యాక్టర్ నాజర్ చెప్పే డైలాగ్‍తో గాండీవధారి అర్జున ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రను నాజర్ పోషించారు. ఆయన క్రిమినళ్లకు టార్గెట్‍గా ఉంటారు. ఆయనను కాపాడే బాధ్యతను ఓ ఏజెన్సీ తరఫున అర్జున్ (వరుణ్ తేజ్) చేపడతారు. ఆ తర్వాత యాక్షన్లు సీన్లు ట్రైలర్‍లో సూపర్‍గా ఉన్నాయి. దేశం కోసం మరో మిషన్‍ను, టాస్కును హీరో అర్జున్‍కు నాజర్ అప్పగిస్తారు. ట్రైలర్‌లోని అంశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షి వైద్య కూడా యాక్షన్ పాత్రలోనే కనిపించింది. మిక్కీ జే మేయర్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు తగ్గట్టే ఇంటెన్స్‌గా ఉంది.

డైరెక్టర్ 'ప్రవీణ్ సత్తారు' ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా ఈ వరుణ్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. వీరిద్దరితో పాటు సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటించారు. ఇక మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది.



Tags

Next Story