Gandeevadhari Arjuna Trailer : హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో రాబోతున్న మెగా ప్రిన్స్

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ లేటెస్ట్ చిత్రం 'గాండీవధారి అర్జున'. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్ కు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. 'VT 12' ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తోన్న సినీ ప్రేక్షకులకు మేకర్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గాండీవధారి అర్జున ట్రైలర్ ను రేపు అంటే ఆగస్టు 10న విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ విషయాన్ని వరుణ్‌తేజ్, ప్రవీణ్ సత్తారు స్వయంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు షూటింగ్ స్పాట్ లో ఓ చాట్ వీడియోను షేర్ చేశారు. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద్ ఐమాక్స్ లో ఈ మూవీ ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నట్టు ఈ వీడియోలో ప్రకటించారు. బుడాపెస్ట్‌లో వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.
'గాండీవధారి అర్జున' నుంచి ఇటీవలి కాలంలో రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'నీ జతై' లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున'తో పాటు 'VT13'లో కూడా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా కథాంశంతో వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com