Gandeevadhari Arjuna : నెక్ట్స్ మూవీలో ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ లేటెస్ట్ మూవీ 'గాంఢీవధారి అర్జున'. వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్నఈ మూవీలో ఏజెంట్ గా ఫేమ్ సాక్షి వైద్య నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు విపరీతమైన స్పందన రాగా.. ఇది హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. అయితే తాజాగా గాంఢీవధారి అర్జున బృందం వైజాగ్ లో సందడి చేసింది. చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్యతో పాటు విమలారామన్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వరుణ్ తేజ్.. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్ మెంట్, మెసేజ్ తో కూడిన చిత్రం 'గాంఢీవధారి అర్జున' అని.. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని వరుణ్ తేజ్ చెప్పారు. కాలుష్యం, వాతావరణం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు యాక్షన్ తో పాటు వినోదాత్మకంగానూ ఈ సినిమాను రూపొందించినట్టు తెలిపారు. వైజాగ్ తనకు ఎంతో నేర్పిందని, ఇక్కడే తాను నటన కూడా నేర్చుకున్నానని అన్నారు. విశాఖ వెదర్ చాలా బాగుంటుందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సినిమా ప్రేమికులని చెప్పారు. దాంతో పాటు రాబోయే సినిమాలో ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటిస్తుననట్టు కూడా ఆయన వెల్లడించారు. తనకు కాబోయే భార్యతో ఎఫ్ -4 లాంటి సినిమాల్లో నటిస్తానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానున్న 'గాంఢీవధారి అర్జున'ను చూసి ఆదరించాలని ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు కోరారు. ఇదిలా ఉండగా మూవీ టీంను చూసిన విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. వారితో పోటీపడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులంతా కలిసి కేక్ కట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com