Jr.NTR : సినిమాలకు గ్యాప్.. ఎన్టీఆర్ కు ఏమైంది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే నాన్ స్టాప్ గా వర్క్ చేయాల్సి ఉంది. మరో నెల రోజుల్లో దేవర విడుదల కాబోతోంది. ఇటు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. వీటి రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి కచ్చితంగా నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ టైమ్ లో సడెన్ గా అతను రెండు నెలలు విశ్రాంతి అంటూ వెకేషన్ కు వెళుతున్నాడు. పోనీ ఇదేమైనా సమ్మరా.. వేడికి తట్టుకోలేక వెకేషన్ కు వెళుతున్నారు అంటే కాదు. అయినా సడెన్ గా ఈ రెండు నెలల గ్యాప్ ఏంటీ.. ఆ టూర్ ప్లాన్ ఏంటీ అని ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ వెకేషన్ కు వెళుతుంది రెస్ట్ తీసుకోవడానికి కాదు. తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి. యస్.. అతని చేతికి గాయమైంది.
రీసెంట్ గా ఎన్టీఆర్ ఇంట్లోనే జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా చేతి మణికట్టుకు గాయమైంది. అది బాగా ఇబ్బంది పెడుతుండటంతో డాక్టర్స్ సలహా మేరకు ఓ రెండు నెలల పాటు రెస్ట్ అవసరం అని చెప్పారట. అయితే చేతి మణికట్టుకే రెండు నెలలా అనే డౌట్ కూడా చాలామందిలో వినిపిస్తోంది. అంటే ఇంకేదైనా పెద్ద గాయమైందా.. అది దాస్తూ కేవలం ఈ చిన్న గాయాన్ని మాత్రమే చూపిస్తున్నారా అని ఆరాలు తీస్తున్నారు. అయినా స్టార్ హీరోలు ఇలా ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా ఏదైనా క్లారిటీ ఇస్తే బావుంటుంది కదా. అప్పుడు లేని పోని రూమర్స్ కు కూడా ఆస్కారం ఉండదు. ఏదేమైనా ఈ క్రూసియల్ టైమ్ లో టూ మంత్స్ రెస్ట్ అంటే దేవర విడుదల టైమ్ లో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, ఫంక్షన్స్ మేటర్ ఏంటీ అంటే.. దానికి ఏదైనా సెపరేట్ ప్లాన్ ఉందేమో చూడాలి. లేదా ఆ టైమ్ కు వచ్చి ప్రమోషన్స్ చేసి మళ్లీ రెస్ట్ మోడ్ లోకి వెళతారేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com