Garikapati: ఆర్ఆర్ఆర్ నటులపై గరికపాటి ప్రశంసలు..

X
By - Prasanna |9 March 2023 1:06 PM IST
Garikapati: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరపై సృష్టించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్.
Garikapati: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరపై సృష్టించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవడం తెలుగు సినిమాకు గర్వకారణం. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రశంసించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇద్దరి హావభావాలు, కాలు కదపడం ఒకే సారి చేస్తూ కవలు కూడా ఇలా చేయరేమో అనే మాదిరిగా చేశారు. ఆస్కార్‌కు నామినేట్ అవడం ప్రశంసనీయం అని సినిమాపై పొగడ్తలు కురిపించారు. నటులను ప్రశంసించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com