Kajal Aggarwal: సినీ పరిశ్రమలో కాజల్‌కు 14 ఏళ్లు.. భర్త గౌతమ్ స్పెషల్ గిఫ్ట్..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం'తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో మరపురాపని పాత్రలు.. అప్పుడే కాజల్‌కు సినీ పరిశ్రమలో 14 ఏళ్లు పూర్తి అయిపోయాయి. ప్రొఫెషనల్‌గానే కాదు పర్సనల్‌గా కూడా కాజల్ లైఫ్‌లో.. ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే కాజల్‌కు సినీ పరిశ్రమలో 14 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా భర్త గౌతమ్ కిచ్లూ.. తనకొక స్పెషల్ గిఫ్ట్‌ను అందించాడు.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ.. ఇద్దరు ఎంతోకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండి 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు కూడా చాలాకాలం వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటినుండి వీరి లైఫ్‌లో ఏ స్పెషల్ సందర్భం అయినా కాజల్ తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో పంచుకోవడం మొదలుపెట్టింది.
ఇటీవల కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయ్యింది. అంతే కాకుండా బేబీ బంప్‌తో పలు ఫోటోలను కూడా షేర్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్త గౌతమ్‌తో దిగిన పాత ఫోటోను షేర్ చేసింది కాజల్. అయితే భర్త గౌతమ్ మాత్రం కాజల్‌కు సినీ పరిశ్రమలో 14 ఏళ్లు పూర్తవ్వడంతో ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.
'నా ప్రియమైన కాజల్ అగర్వాల్ కామన్ డీపీ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. 14 ఏళ్లు గడిచిపోయినా.. ఇంకా మరెన్నో ఏళ్లు గడవాల్సి ఉంది.' అంటూ 14 ఇయర్స్ ఆఫ్ కాజల్ అగర్వాల్ కామన్ డీపీని లాంచ్ చేశాడు గౌతమ్.
Take immense pleasure in launching the CDP for our dearest @MsKajalAggarwal ❤️
— kitchlug (@kitchlug) February 14, 2021
14 years down & several more to go... #14MajesticYearsOfQueenKajal
Designed by @manjunath065 #TeamKajalism pic.twitter.com/2aD0Q0Gy1P
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com