Gautham Karthik and Manjima Mohan: ప్రేమలో పడ్డ స్టార్ హీరో కొడుకు.. ఆ హీరోయిన్‌తో త్వరలో పెళ్లి..

Gautham Karthik and Manjima Mohan: ఈమధ్య కోలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమాయణాలు ఎక్కువయ్యాయి. ఒకట్రెండు సినిమాలు కలిసి చేసిన తర్వాత హీరో, హీరోయిన్ డేటింగ్ చేసే కల్చర్ సౌత్‌లో కంటే నార్త్‌లోనే కామన్. కానీ ఆ కల్చర్ ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. కానీ డేటింగ్‌ను పక్కన పెట్టి సౌత్ హీరో, హీరోయిన్లు ఏకంగా పెళ్లికే రెడీ అయిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో కుమారుడు, తన కో యాక్టర్‌తో ప్రేమలో పడినట్టు పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల శింబు, నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దీని గురించి ఏ మాత్రం హింట్ కూడా లేదు. తాజాగా వీరిలాగే ఒక్క సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడిపోయారట గౌతమ్ కార్తిక్, మంజిమ మోహన్. వీరిద్దరు 2019లో విడుదలయిన 'దేవరత్తమ్' అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్టు టాక్.
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హ్యాండ్‌సమ్ హీరోగా వెలిగిపోయిన కార్తిక్ కుమారుడే గౌతమ్ కార్తిక్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కడల్' అనే చిత్రంలో గౌతమ్ హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇదే సినిమాను 'కడలి' అనే పేరుతో తెలుగులో కూడా డబ్ చేశారు. కడలి కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా.. గౌతమ్‌కు మాత్రం మంచి డెబ్యూగా నిలిచిపోయింది.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో మంజిమ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తాను మళ్లీ ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం ఈ భామ గౌతమ్ కార్తిక్‌తో ప్రేమలో ఉన్నట్టు, వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా వాలుంటైన్స్ డే రోజు వీరి ప్రేమ గురించి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రానుందని కోలీవుడ్ వర్గాలు చెప్తు్న్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com