Vijay Devarakonda: గీత గోవిందం కాంబో రిపీట్.. త్వరలో సెట్స్ పైకి..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ టైమ్ బాలేదు.. ఈ మధ్య సినిమాలు ఏవీ లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి.. సరిగ్గా ఇదే సమయంలో గీత గోవిందంతో హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురాం గుర్తుకు వచ్చారు.
ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నాడు విజయ్.. దిల్ రాజ్ నిర్మాతగా, పరశురాం దర్శకుడిగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది.
విజయ్ ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించాడు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ప్రకటించారు.
ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్రంలోని ఇతర నటీ నటుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ తో జోడీ కట్టనున్న భామ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com