Gehraiyaan: ఆ సినిమాలో ముద్దులు.. అది నా పర్సనల్: దీపికా పదుకొణె

Gehraiyaan: ఆ సినిమాలో ముద్దులు.. అది నా పర్సనల్: దీపికా పదుకొణె
Gehraiyaan: ముద్దులు హద్దులు మీరాయని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Gehraiyaan: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన సినిమా గెహ్రాయియన్.. ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ చిత్రం విడుదలకు ముందే బోలెడంత పబ్లిసిటీ తెచ్చుకుంది.. కారణం ఆ చిత్రంలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించడం ఒకటైతే.. ముద్దులు హద్దులు మీరాయని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వీటన్నింటికీ వివరణ ఇచ్చిన దీపిక సన్నిహిత దృశ్యాలు ప్రేక్షకులను ఉత్తేజ పనిచేవి కావని పేర్కొంది.

గెహ్రాయియన్‌లో అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శకున్ బత్రా దర్శకత్వం వహించారు. ఆధునిక సంబంధాలు, అవిశ్వాసం అనే భావనపై ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్రంలో, దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది తమ భాగస్వాములను మోసం చేయడంతోపాటు కొన్ని సన్నిహిత సన్నివేశాలను కూడా పంచుకుంటారు.

ఇంటిమేట్ సన్నివేశాల గురించి దీపికా పదుకొణె మాట్లాడుతూ, ఇలాంటి విషయాలకు జెండర్ ఆపాదించను. ఇది సాధారణంగా జరిగేదే. అదే సినిమాలో ఉంటుంది. నేను 100 శాతం చెబుతాను, 'గెహ్రాయియన్' వంటి చిత్రం శకున్ వంటి దర్శకుడు తీయకపోతే ఆ చిత్రంలో తాను నటించేదాన్ని కానని చెప్పింది. కథపై దర్శకుడికి ఓ నిర్ధిష్టమైన అభిప్రాయం ఉందని తెలిపింది.

గెహ్రాయియన్‌తో పాటు , దీపికా పదుకొణె హృతిక్ రోషన్‌తో ఫైటర్, షారుఖ్ ఖాన్‌తో పఠాన్, టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తదుపరి చిత్రం కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story