Genelia: రీ ఎంట్రీ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న జెనీలియా..

Genelia (tv5news.in)

Genelia (tv5news.in)

Genelia: గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Genelia: పేరుకే తాను ఒక నార్త్ అమ్మాయి అయినా.. కొంతకాలం పాటు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అలరిస్తూ ప్రేక్షకుల మనసులో తెలుగమ్మాయిగా ముద్ర వేసుకుంది జెనీలియా. తను నటించిన సినిమాలు, చేసిన పాత్రలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యింది జెనీలియా. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. తాజాగా సౌత్‌లోకి కూడా మళ్లీ అడుగుపెట్టనుంది.


జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా తనకు ఎప్పటికి అప్పుడు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకో ఇంతకాలం మళ్లీ తెరపై కనిపించాలి అనుకోలేదు. కానీ ఇంతకాలం తర్వాత ఓ డెబ్యూ హీరోతో కలిసి నటించడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దీనికోసం తాను భారీ రెమ్యునరేషన్నే డిమాండ్ చేస్తున్నట్టు టాక్.


ఇటీవల గాలి కిరీటి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీలతో పాటు జెనీలియా కూడా పాల్గొంది. పూజా కార్యక్రమం తర్వాత సౌత్‌లో రీ ఎంట్రీ ఇవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అంతే కాకుండా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ కూడా చెప్పుకుంది.

జెనీలియా హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో హీరోయిన్‌లకు కేవలం లక్షల్లోనే పారితోషికం ఉండేది. ఎవరో ఒక సీనియర్ హీరోయిన్ మాత్రమే కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. అయితే అప్పట్లో జెనీలియా రెమ్యునరేషన్ రూ. 70 లక్షలు అని సమాచారం. కాగా ఇప్పుడు రీ ఎంట్రీ కోసం జెనీలియా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్లు మాత్రమే అంత పారితోషికం తీసుకుంటూ ఉండగా.. రీ ఎంట్రీ కోసం కూడా జెనీలియా అంత రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story